మంగళగిరి: జోగి రమేష్ అక్రమంగా అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్న

11చూసినవారు
మంగళగిరి: జోగి రమేష్ అక్రమంగా అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్న
మంగళగిరి నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త దొంతి రెడ్డి వేమారెడ్డి ఆదివారం తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారని ఆరోపించారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఇరికించారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్