రాజధాని ప్రాంతమైన మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో తాపీ మేస్త్రి సుబ్బారావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో, దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు వివాహేతర సంబంధం కారణంగా మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.