మంత్రి నారా లోకేశ్ ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నాడు కుంచనపల్లి గ్రామాన్ని సందర్శించనున్నారు. అక్కడ గంగా, అన్నపూర్ణాదేవి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటల 39 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో కోరారు.