విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 4వ తేదీ, మంగళవారం నాడు తెదేపా కేంద్ర కార్యాలయంలో 'ప్రజాదర్బార్' నిర్వహించనున్నారు. మంగళగిరి నియోజకవర్గ తెదేపా కార్యాలయం నుంచి సోమవారం విడుదలైన ప్రకటనలో, ఉదయం 8 గంటల నుంచి మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నేరుగా సమస్యలపై అర్జీలు అందించవచ్చని మంత్రి పేర్కొన్నారు.