మంగళగిరి: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంటీఎంసీ కమిషనర్

1చూసినవారు
మంగళగిరి: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంటీఎంసీ కమిషనర్
మంగళగిరిలో జూన్ 5న మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా ఆవిష్కరించారు. వి. జే. జూనియర్ కాలేజీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ మేళాలో 950 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. నైపుణ్యం పోర్టల్ ద్వారా లేదా నేరుగా మేళా ప్రాంగణంలో నమోదు చేసుకోవచ్చు. మంగళగిరి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాలకు 8074597926, 7780588993 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్