ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు'ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖకు ప్రత్యేక వాహనాలు, అంబులెన్స్లను అందజేశారు. వన్యప్రాణులు-మనుషుల మధ్య సంఘర్షణను తగ్గించడం, ముఖ్యంగా ఏనుగుల వల్ల పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పవన్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.