నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, భద్రతాయుతంగా నిర్వహించేందుకు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. మండల ప్రజలకు ఆయన ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు, ముఖ్య కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, దేవాలయాలు, హోటళ్లు, ప్రధాన రహదారుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు నైట్ ప్యాట్రోలింగ్ను కఠినతరం చేసినట్లు వెల్లడించారు.