మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని మోడ్రన్ శాఖా గ్రంథాలయంలో నైపుణ్యం పోర్టల్కు రూపకల్పన చేశారు. ఈ పోర్టల్ ద్వారా ఎలక్ట్రికల్, ఉడ్వర్క్, ఏసీ, ఆర్క్ వెల్డింగ్ వంటి 34 రంగాల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై మంగళగిరి పరిసర ప్రాంత యువతీ, యువకులకు, ఐటీఐ చదివిన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళగిరిలోని మోడల్ లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి.