రాజధాని అమరావతిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించి, కొండవీటి వాగు అభివృద్ధి పనులను పరిశీలించారు. N9, N8, N7 రోడ్లపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పురోగతిని సమీక్షించారు. బ్రిడ్జిల కింద వాగు ప్రవాహానికి ఆటంకం కలిగించే మట్టిని తొలగించాలని, వాగు వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను కూడా ఆయన పరిశీలించారు.