మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో తాపీ మేస్త్రి సుబ్బారావు అనుమానాస్పద మృతిపై సీఐ బ్రహ్మయ్య మంగళవారం మీడియాతో మాట్లాడారు. మృతుడు దుగ్గిరాల మండలం మాచికలపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు అని, అతనికి ఐదు నెలల క్రితం కుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడిందని కొందరు చెప్పినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు.