మంగళగిరి: ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం.

5చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలు గత ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలను తక్షణం విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం మంగళగిరి ఏపీఐఎస్సి భవనం వద్ద నిరసన తెలిపారు. తాము మొదటి తరం ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలమని, రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో మంజూరైన సబ్సిడీలు, ఇన్సెంటివ్లు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.