చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్‌

0చూసినవారు
చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్‌
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంకరతో నిండిన టిప్పర్ లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. ట్విట్టర్‌ ద్వారా స్పందించిన ఆయన, మరణించిన వారందరికీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్