తాడేపల్లిలోని సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో ఇసుక ప్రాంతంలో ఈ నెల 13న గుర్తు తెలియని 35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట వడదెబ్బతో మరణించాడని భావించినా, శవపంచనామా నివేదికతో అది హత్య అని తేలింది. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందిన రాజీవ్ అలియాస్ రాజు, ఓ మహిళతో కలిసి పుష్కరఘాట్లో నిద్రిస్తుండగా, వారితో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన రాజు ఆ వ్యక్తిపై దాడి చేసి గాయపరచి పరారయ్యాడు. పోలీసు విచారణలో రాజు తన తప్పును అంగీకరించి లొంగిపోయాడు. మంగళగిరి కోర్టులో హాజరుపరచగా రిమాండుకు పంపారు.