ఏపీ క్యాబినెట్ భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం అర్ధాంతరంగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడినట్లు సమాచారం. దీంతో ఆయన వెంటనే మంగళగిరిలోని పార్టీ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.