మంగళగిరి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

2చూసినవారు
మంగళగిరి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
మంగళగిరి ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు మంత్రి నారా లోకేష్ చొరవతో శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ. 393. 74 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 8న ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి సలాం సెంటర్ వద్ద శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మంగళగిరి, పరిసర ప్రాంతాలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. ఇది ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది.

సంబంధిత పోస్ట్