ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధిపై చర్చించారు. 'జల్ జీవన్ మిషన్' ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, రహదారుల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై ఇరువురు నేతలు దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరంగా చేపట్టాల్సిన ప్రాధాన్యత అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.