గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో శ్రీ గంగ శ్రీ అన్నపూర్ణ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం శంకుస్థాపన మహోత్సవంలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి స్వాగతం పలికిన అనంతరం, ఆయన స్వామివారికి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.