తాడేపల్లి కొత్తూరులోని ప్యారి కంపెనీ హెలిపాడ్ వద్ద పందుల స్వైర విహారం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పందుల పెంపకదారులు జనావాసాల్లోకి పందులను వదులుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటస్థలాలు, వాకింగ్ ట్రాక్‌లలో పందుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెదడువాపు వంటి వ్యాధుల ప్రమాదం ఉందని ఆందోళన చెందుతూ, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.