తాడేపల్లిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన జ్యోతి అనే మహిళకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2016 మే 26న నులకపేటకు చెందిన జ్యోతి గంజాయి విక్రయిస్తుండగా అప్పటి ఎస్ఐ ప్రతాప్ దాడి చేసి పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.