మంగళగిరిలో నేడు టీడీపీ మహానాడు రెండో రోజు

2చూసినవారు
మంగళగిరిలో నేడు టీడీపీ మహానాడు రెండో రోజు
మంగళగిరిలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండోరోజు కార్యక్రమాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు సహా పార్టీ ముఖ్య నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. కార్యక్రమం ముగింపులో పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :