గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఎస్ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, హాయ్‌ల్యాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన అతడు నిర్జీవంగా కనిపించినట్లు తెలిపారు. ప్రాథమికంగా వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.