
వల్లభేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం
రొంపిచర్ల మండలం విప్పర్లలోని వల్లభేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఉదయం సూర్య కిరణాలు నేరుగా వల్లభేశ్వర స్వామిని తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు. స్వామివారు సూర్యకాంతిలో దర్శనమివ్వడంతో, భక్తులు ఆ వెలుగుల్లోనే స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసింది.





































