2025 నేర గణాంకాలు: 45 హత్యలు, పోక్సో కేసులు 73కి పెరిగాయి

898చూసినవారు
2025 నేర గణాంకాలు: 45 హత్యలు, పోక్సో కేసులు 73కి పెరిగాయి
జిల్లాలో 2025 సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాలను ఎస్పీ కృష్ణారావు విడుదల చేశారు. ఈ ఏడాది పలు కీలక కేసుల్లో ఒకరికి మరణశిక్ష, 8 మందికి యావజ్జీవ శిక్ష పడేలా సమర్థవంతంగా సాక్ష్యాలను ప్రవేశపెట్టామని తెలిపారు. జిల్లాలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 45 హత్యలు నమోదయ్యాయని, అయితే పోక్సో కేసులు 50 నుంచి 73కి పెరగడం ఆందోళనకరమన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు.