గురువారం నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురు సిబ్బందికి ఘన సన్మానం జరిగింది. అదనపు ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ పూలమాలలు, బహుమతులతో వారిని అభినందించారు. సుదీర్ఘకాలం సేవలందించిన ఏఎస్సైలు పి. శివారెడ్డి, డి. శ్రీనివాసరావు, హోంగార్డ్ ఎస్. నాగేశ్వరరావులను సత్కరించారు. వారి సేవలు భావితరాలకు ఆదర్శమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.