గురువారం రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంటి బయట కూర్చున్న 80 ఏళ్ల రావులమ్మ మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కొని పారిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్ఐ లోకేశ్వరావు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.