ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7.30 గంటలకు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి బయలుదేరిన ఆయన, ఈ ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి చేరుకుని, మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో డేటా డ్రివెన్ గవర్నెన్స్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.