అవసరానికి మించి ఇంధనం కొనొద్దు: కలెక్టర్ కృతిక శుక్లా

10చూసినవారు
అవసరానికి మించి ఇంధనం కొనొద్దు: కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని, ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజల్ కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదివారం విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మొత్తం 201 పెట్రోల్ బంకులు పనిచేస్తుండగా, ప్రతి బంక్ వద్ద ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్పిడి వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ నంబర్ 08647-226999 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్