సాయుధ దళాలా పతాక దినోత్సవం నిదికి విరాళాలు ఇవ్వాలి

3చూసినవారు
సాయుధ దళాలా పతాక దినోత్సవం నిదికి విరాళాలు ఇవ్వాలి
దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికుల కుటుంబాల సహాయార్థం సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి విరాళాలు ఇవ్వాలని డిపిఆర్ఓ మురళి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ పల్నాడు లో సైనిక సంక్షేమ శాఖకు సంబంధించి సాయుధ దళాల ఫ్లాగ్ డే స్టికర్స్ ను జిల్లా అధికారులతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధులత, డి ఆనంద రావు, వెంకట రాజేష్ (టైపిస్ట్, సైనిక సంక్షేమ శాఖ) పాల్గొన్నారు. సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్