ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన పర్చూరు మాజీ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పర్చూరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన మృతి వార్తతో రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామానికి చెందిన గాదె వెంకటరెడ్డి తన రాజకీయ ప్రస్థానంతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డి పర్చూరు
వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.