
దారుణం.. పసిపిల్లలను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కారు (వీడియో)
ఇండోనేషియాలోని యోగ్యకర్తలో ఒక డేకేర్ సెంటర్ లో పిల్లలపై సిబ్బంది అమానవీయ హింసకు పాల్పడిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 103 మంది పిల్లలలో 53 మంది తీవ్ర హింసకు గురైనట్లు గుర్తించారు. పిల్లలను కట్టేయడం, నోట్లో గుడ్డలు కుక్కడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. బాధితుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.




