ఆటో నుంచి జారి వ్యక్తి మృతి

1చూసినవారు
ఆటో నుంచి జారి వ్యక్తి మృతి
నరసరావుపేట: సోమవారం రాత్రి యల్లమంద సమీపంలో ఆటో ప్రయాణంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో 64 ఏళ్ల చలిచీమల కృష్ణారావు అనే వ్యక్తి మృతి చెందాడు. కాకాని గ్రామానికి చెందిన కృష్ణారావు బంధువుల కార్యక్రమానికి యల్లమంద వెళ్లి, తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తుండగా మార్గమధ్యంలో జారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరణించాడు. కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్