నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆదివారం నరసరావుపేట–సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. స్టేడియంలోని వాకింగ్ ట్రాక్, కమ్యూనిటీ టాయిలెట్ల స్థితిని పరిశీలించి అవసరమైన సదుపాయాలపై సూచనలు ఇచ్చారు. అనంతరం ఉదయం వ్యాయామం చేస్తున్న పౌరులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుని, క్రీడా మైదాన అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.