కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సూపర్ సిక్స్' పథకం విజయవంతమైందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తెలిపారు. నరసరావుపేటలో సోమవారం ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రూ. 6 వేలు, వృద్ధులకు రూ. 4 వేల చొప్పున నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.