నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ నిధులు తక్షణం విడుదల చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోరారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కె. కృష్ణ తేజను ఆయన కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఏరియా హాస్పిటల్ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వకేట్ చిన్నపరెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నారు.