నరసరావుపేట: భవన నిర్మాణ కార్మికులు తప్పనిసరిగా నమోదు కావాలి

2607చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో, జిల్లా లేబర్ అసిస్టెంట్ కమిషనర్ సుభాని భవన నిర్మాణ కార్మికులకు తమ పేర్లను కార్మికశాఖ కార్యాలయాల్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల కార్మికులు నమోదు చేసుకుని గుర్తింపు కార్డులు పొందాలని, తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికుల భద్రత, భవిష్యత్ రక్షణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.