నరసరావుపేట: మత్స్య కారులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి: కలెక్టర్

11చూసినవారు
నరసరావుపేట: మత్స్య కారులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి: కలెక్టర్
గురువారం నరసరావుపేటలోని తమ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మత్స్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖలో అమలు జరుగుతున్న వివిధ పథకాలపై చర్చించారు. మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించిన మత్స్య సహకార సంఘాలకు కనిష్ట ధరలకు లీజులు ఇవ్వడం, జిల్లాలోని 3300 ఎకరాలలో చేపలు, రొయ్యల పెంపకం దారులకు లైసెన్సులు మంజూరు చేసి, వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వంటి అంశాలపై చర్చ జరిగింది.