నరసరావుపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన తన అరచేతిలో కర్పూరం వెలిగించి హారతి సమర్పించడం విశేషం. అనంతరం అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించగా, భక్తులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అన్నదానం కూడా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.