ఇంధనంపై ఆందోళన వద్దు: కలెక్టర్

23చూసినవారు
నరసరావుపేట: జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సూచించారు. తిమ్మాపురం గ్రామంలోని పెట్రోల్ బంక్‌ను బుధవారం తనిఖీ చేసిన ఆమె, డిజిటల్ చెల్లింపులను తప్పనిసరిగా స్వీకరించాలని బంక్ యజమానులకు ఆదేశించారు. ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్ శాఖలతో కలిసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్