
భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
కెనడాలో భారతీయ విద్యార్థుల వీసాలు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి. 2025 ఆగస్టులో దరఖాస్తు చేసుకున్న వారిలో 74 శాతం మందికి వీసాలు నిరాకరించబడ్డాయి, ఇది 2023లో 32 శాతంగా ఉంది. చైనా విద్యార్థుల తిరస్కరణ రేటు 24% కాగా, ఇతర దేశాల సగటు 40%గా ఉంది. కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం ఈ తిరస్కరణలు పెరిగాయి. నివాస కొరత, మౌలిక సదుపాయాల ఇబ్బందులు, అధిక ఖర్చులు వంటి స్థానిక పరిస్థితులు దీనికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయంగా జర్మనీ వైపు చూస్తున్నారు.




