భూముల మార్కెట్ విలువల సవరణ ప్రతిపాదనలను వాస్తవ ధరల ఆధారంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూసేకరణ కోసం రైతులకు చెల్లించే పరిహారం మార్కెట్ విలువపైనే ఆధారపడుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ఆదాయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.