నరసరావుపేట ములకలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళా మృతి

4చూసినవారు
శుక్రవారం రాత్రి పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ములకలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నిషా (25) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. విజయవాడకు చెందిన మల్లికా (22) అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఇద్దరు యువతులు నరసరావుపేటలో ఈవెంట్స్ పనుల నిమిత్తం గత కొన్ని నెలలుగా నివసిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్