రొంపిచర్ల మండలం రాజుల బజార్లో మంగళవారం సాయంత్రం విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా జార్ఖండ్‌కు చెందిన గోనె గోపి (21) విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఇన్వర్టర్ నుంచి రివర్స్ కరెంట్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అతడిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.