పల్నాడు జిల్లాలో ఇంధన విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కృతిక శుక్లా కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లోని రెండు ఫిల్లింగ్ స్టేషన్లను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించిన ఆమె, బంకుల వద్ద పరిస్థితులను సమీక్షించి, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.