యూజర్ ఛార్జీలు రద్దు చేయాలి: గోపిరెడ్డి డిమాండ్

9చూసినవారు
నరసరావుపేట జిల్లా క్రీడా స్టేడియంలో యూజర్ ఛార్జీల అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. స్టేడియంలోని జిమ్, షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ మూతపడినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి, ఫీజుల భారంతో వారిని నిరుత్సాహపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్