పర్చూరు - Parchur

కారంచేడు: ఈ పోలీసులది 'బంగారం' లాంటి మనసు

కారంచేడు: ఈ పోలీసులది 'బంగారం' లాంటి మనసు

స్వర్ణ గ్రామానికి చెందిన తిరుమలశెట్టి రాజ్యమ్మ అనే వృద్ధురాలికి చెందిన మూడు సవర్ల బంగారు గొలుసు రెండు రోజులుగా కనిపించలేదు. ఇంట్లో, తెలిసిన వారి వద్ద వెతికినా దొరకకపోవడంతో ఆమె కారంచేడు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఎస్ఐ షేక్ ఖాదర్ బాషా తన సిబ్బందితో కలిసి అనుమానించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అనుమానాస్పద పరిస్థితులు కనిపించకపోవడంతో, ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలోనే గాలించగా గొలుసు దొరికింది. పొగొట్టుకున్న గొలుసు తిరిగి దొరకడంతో వృద్ధురాలు ఆనందంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

వీడియోలు


మంచిర్యాల జిల్లా