రెండు రోజులుగా ఎయిర్‌టెల్ సిగ్నల్స్ బంద్.. వినియోగదారుల ఆవేదన

4చూసినవారు
రెండు రోజులుగా ఎయిర్‌టెల్ సిగ్నల్స్ బంద్.. వినియోగదారుల ఆవేదన
రామకూరు, లక్కవరం గ్రామాల్లో గత రెండు రోజులుగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సేవలు సరిగా పనిచేయకపోవడంతో వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఆన్‌లైన్ పనులు, కమ్యూనికేషన్లకు ఆటంకం ఏర్పడింది. పలుమార్లు ఫిర్యాదు చేసినా సిబ్బంది స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్