పర్చూరు నియోజకవర్గ వార్త. ఇంకొల్లు ఎన్.ఆర్ అండ్ వి ఎస్ ఆర్ గర్ల్స్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. స్కూల్ ప్రారంభించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. 40 ఏళ్ల క్రితం చదివిన విద్యార్థులు, గతంలో పనిచేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులు హాజరయ్యారు. విశ్రాంత ఉపాధ్యాయుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.