అకాల వర్షాలతో మిరప రైతుల్లో ఆందోళన

11చూసినవారు
అకాల వర్షాలతో మిరప రైతుల్లో ఆందోళన
పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో శనివారం కురిసిన అకాల వర్షాల వల్ల కల్లాల్లో ఆరబెట్టిన మిరప పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, పీఎసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీశ్ పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు అండగా ఉంటారని, పంట నష్ట వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్