మొంథా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రాణ నష్టం లేకుండా పని చేసిన అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలను ఆయన అభినందించారు. హెచ్చరికలకు స్పందించి జాగ్రత్త చర్యలు తీసుకున్నందుకు ప్రజలను ప్రశంసించారు.