కలెక్టర్ వినోద్ కుమార్ ఇంకొల్లు హైస్కూల్ కు రాక

0చూసినవారు
కలెక్టర్ వినోద్ కుమార్ ఇంకొల్లు హైస్కూల్ కు రాక
బాపట్ల జిల్లా ఇంకొల్లు జిల్లా పరిషత్ హైస్కూల్ కు ఈనెల 5వ తేదీన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రానున్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను బుధవారం హైస్కూల్లో ఎమ్మార్వో ఎన్ఎస్వి శ్రీనివాసరావు, ఎంపీడీవో జి శ్రీనివాసరావు పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు గోగినేని బాలకృష్ణ, పంచాయతీ సెక్రెటరీ సుబ్బరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్